పవన్‌కు ‘దారి’ చూపుదాం!
‘అత్తారింటికి దారేది?’ అంటూ బయలుదేరిన సినీనటుడు పవన్ కల్యాణ్‌కు టీడీపీ
నేతలు ఒక పథకం ప్రకారం దారి చూపిస్తున్నారట. టీడీపీలో అంతా ఇప్పుడు ఈ
‘దారి’పైనే చర్చ జరుగుతోంది. పవన్ కల్యాణ్ తన సోదరుడు చిరంజీవికి
దూరమయ్యారన్న ప్రచారానికి తోడు ఇటీవలి కాలంలో అత్తారింటికి దారేది సినిమా
విజయవంతమైన నేపథ్యంలో టీడీపీ ఈ కొత్త స్క్రిప్ట్ తయారు చేసి అమలు
చేస్తోందట. ఆ స్క్రిప్టు ప్రకారం.. అప్పుడెప్పుడో ఒక సినిమా కార్యక్రమంలో
సినీనటుడు బాలకృష్ణతో పవన్ కలిసిన ఫొటోలను ఫ్లెక్సీలుగా ఏర్పాటు చేశారట. ఆ
తర్వాత సోషల్ మీడియాలో ఒక్కొక్కటిగా ప్రచారం చేశారట. ఇంకేముంది టీడీపీ
అనుకూల మీడియా ఆ విషయాన్ని తెరమీదకు తేవడం అంతా పథకం ప్రకారం జరిగిపోయిందట.
పవన్ తమ పార్టీలో చేరుతున్నారన్న విధంగా సంకేతాలిస్తూ టీడీపీ విస్తృత
ప్రచారానికి తెరలేపింది. చతికిల పడిన పార్టీని ఈ రకంగా ఎవరో ఒకరు వచ్చి
ఆదుకుంటారని చూస్తున్న ఆ పార్టీ నేతలు ఇలా చేస్తున్న ప్రచారంపై పవన్
సన్నిహితులు ఆగ్రహంతో ఉన్నారట.
దొరికిందే సందు అని.. చిరంజీవి అంటే సరిపడని రాష్ట్రానికి చెందిన ఒక ముఖ్య
నేత ‘నీవు ముందు కెళ్లు.. నీ వెనక నేనుంటా’నని పవన్‌ను లాగే ప్రయత్నం
చేశారట. రాష్ట్రంలో విభజన అంశం ఊపుమీదున్న ఈ సమయంలో.. ‘మా పవర్‌స్టార్‌ను
ఇబ్బంది పెట్టడానికో... లేదా ఇండస్ట్రీలో దెబ్బతీయడానికో.. మొత్తానికి ఏదో
జరుగుతోంద’ని పవన్ అభిమానులు కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట.
జరుగుతున్న ప్రచారంపై పవన్ సన్నిహితులు కొందరు ఆరా తీస్తే... ‘పవన్‌కు
ఎలాంటి ఆలోచనలు లేకున్నా ముందు ఆయనను ఆలోచనలో పడేయటం, టీడీపీలో చేరితే
బాగుంటుందన్న విధంగా మైండ్ గేమ్ ప్లే చేయడం.. ఇంతవరకే మా ప్లాన్.. ఆ తర్వాత
ఆయనిష్టం.. బురద జల్లడమే మా వంతు. కడుక్కోవడం ఆయన వంతే’ అని సెలవిచ్చారట.
No comments:
Post a Comment